ఇన్నర్​ రింగ్​ రోడ్​ కేసు:  చంద్రబాబు ముందస్తు బెయిల్​ విచారణ వాయిదా

ఇన్నర్​ రింగ్​ రోడ్​ కేసు:  చంద్రబాబు ముందస్తు బెయిల్​ విచారణ వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు ( నవంబర్​ 29)విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్​ రింగ్​ రోడ్డు  మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తరువాత హైకోర్టు దీని విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌ మీద కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. 

ఇంకోవైపు మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ కు సిఐడి జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా న్యాయస్థానం విచారణ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ కోర్టును సమయం కోరింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణను వచ్చే నెల 6నకు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-19 నిందితుడిగా వరుణ్ ఉన్నారు.